ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తప్పుకుంది. గురువారం మహిళల డబుల్స్ తొలి రౌండ్ సందర్భంగా ఆమె కాలి కండరాల భాగంలో తీవ్ర గాయం కావడంతో ఏకంగా టోర్నమెంట్‌ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

Also Read:మరీ సాగించుకుంటున్నావ్, అరటిపండు తొక్క తీసుకోలేవా: ఆటగాడికి గడ్డిపెట్టిన అంపైర్

ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచె‌నోక్ జతగా సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో నిలిచారు. మహిళల డబుల్స్‌లో భాగంగా చైనా జంట జింయున్ హాన్, జిన్‌ ఝతో జరిగిన మ్యాచ్ రెండో సెట్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉన్న సమయంలో సానియా కండరాల గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం నుంచి తప్పుకున్నారు.

Also Read:ఎవరీ సర్ఫరాజ్ ఖాన్?: జీవితంలో ఎక్కువ కాలం టెంట్ కిందే, తిండిపోతు

తొలి సెట్‌లో సానియా జోడీ 2-6 తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌లోనే సానియా కాలికి గాయమైంది. అయితే పట్టీ ధరించి ఆమె నొప్పిని భరిస్తూనే 33 నిమిషాల పాటు మ్యాచ్ ఆడింది. అయితే నొప్పి భరించలేక మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది.