నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి దేశ స్థాయిలో గుర్తింపు సాధించింది. కోవిడ్ సమయంలో కరోనా పేషంట్స్ కు వైద్య సిబ్బంది చేసిన సేవలను క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తించారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా తన ఫౌండేషన్ తఫున 2.5 కోట్లు విలువ చేసే 120 ఐసీయూ బెడ్స్ అందజేశారు. 

క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనస్సు చాటుకున్నారు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి 2.5 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు సమకూర్చారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా ఆస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్ ఏర్పాటుకు యువరాజ్ సింగ్ ముందుకొచ్చారు.

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి దేశ స్థాయిలో గుర్తింపు సాధించింది. కోవిడ్ సమయంలో కరోనా పేషంట్స్ కు వైద్య సిబ్బంది చేసిన సేవలను క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తించారు. మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా తన ఫౌండేషన్ తఫున 2.5 కోట్లు విలువ చేసే 120 ఐసీయూ బెడ్స్ అందజేశారు. ఈ మేరకు యూవీకేన్ ఫౌండేషన్ సభ్యులు జిల్లా ఆస్పత్రిలోని రెండు వార్డులలో ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేశారు. 

క్రికెటర్ యువరాజ్ సింగ్ మిషన్ థౌజండ్ బెడ్స్ పేరుతో దేశ వ్యాప్తంగా సర్కారు ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు జిల్లా ఆస్పత్రి వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు జిల్లా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు ఆవశ్యకతపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకుని యూవీకెన్ ఫౌండేషన్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ కవిత చొరవతో క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనస్సు చాటుకుని జిల్లా ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా ఐసీయూ బెడ్స్ అందించారు. 

ఒకేసారి రికార్డు స్థాయిలో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ అందుబాటులోకి రావడంతో కార్పొరేట్ వైద్యం నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉచితంగా అందనుంది. 10 యేళ్ల వరకు పనికొచ్చేలా నాణ్యమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆస్పత్రిలో ఏర్పాటు చేశామని యూవీకెన్ ఫౌండేషన్ ప్రతినిధులు చొరవ తీసుకోవడం ఫలితాలనిచ్చింది. 120 బెడ్లను ఈ నెల 28న అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.