Asianet News TeluguAsianet News Telugu

కేంద్రానికి అమ్ముతారో.. విదేశాలకు విక్రయిస్తారో, ధాన్యం కొనాల్సిందే: కేసీఆర్‌కు షర్మిల అల్టీమేటం

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) . ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. రైతులకు సంబంధం లేని విషయాలను వాళ్ల నెత్తిన రుద్దడం భావ్యం కాదన్నారు. ఎంతైతే వారి పండిస్తారో .. ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు  కొనాల్సిందేనని షర్మిల అన్నారు. 

ysrtp president ys sharmila slams telangana cm kcr over paddy procurement
Author
Hyderabad, First Published Jan 7, 2022, 4:48 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) . శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్నా ఒక్కరైతు కుటుంబాన్ని అయినా కేసీఆర్ (kcr) పరామర్శించారా అని షర్మిల ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. రైతులకు సంబంధం లేని విషయాలను వాళ్ల నెత్తిన రుద్దడం భావ్యం కాదన్నారు. ఎంతైతే వారి పండిస్తారో .. ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు  కొనాల్సిందేనని షర్మిల అన్నారు. 

కేసీఆర్ కేంద్రానికి అమ్ముకుంటారో.. లేక పక్క దేశానికి అమ్ముకుంటారో, లేక పక్కరాష్ట్రానికి అమ్ముకుంటారో, లేక బాయిల్ రైస్‌గా చేసుకుంటారో ఆయన ఇష్టమని.. కానీ కొనాల్సిందేనని షర్మిల తేల్చిచెప్పారు. ప్రత్నామ్నాయ పంటలు వేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయని .. చాలా లాభపడిపోతారని కేసీఆర్ చెబుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మద్ధతు ధర వున్న పంటను వేసుకోవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని షర్మిల పేర్కొన్నారు. మిర్చి, పత్తి వంటి పంటలు వేసుకుని ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. 

ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న రైతులు కోటీశ్వరులు కాలేదని.. వాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట పండే భూముల్లో.. ఇంకోటి పండించడం కష్టమన్న ఇంగితం కేసీఆర్‌కు లేదంటూ ఆమె ఎద్దేవా చేశారు. గడిచిన ఏడున్నర సంవత్సరాల్లో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వీరిలో ఏ ఒక్కరి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని, పైసా కూడా ఆర్ధిక సాయం చేయలేదని ఆమె దుయ్యబట్టారు. 

ఈరోజుకి కూడా వేలాది మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే వున్నారని షర్మిల గుర్తుచేశారు. దున్న మీద వానపడ్డట్లు.. ఎంతమంది చనిపోతే నాకేందుకు అన్నట్లుగా కేసీఆర్ వున్నారని ఆమె చురకలు వేశారు. పిల్లికి కూడా పాలు పోయరు కానీ.. వీధిలో వున్న వారందరికీ ఉత్తిన దావత్ ఇస్తాడన్నారట అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం వుందన్నారు. ఇక్కడి రైతులను పట్టించుకోని కేసీఆర్.. ఎక్కడో హర్యానాలో (haryana) చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. 

వైఎస్సార్ తెలంగాణ (ysrtp) పేరుతో నూతన రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు వైఎస్ షర్మిల. ఇప్పటికే ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతుల పక్షాన నిలిచి పోరాడుతున్న ఆమె మరోవైపు పార్టీ బలోపేతానికి కూడా కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుండి వైఎస్సార్ టిపి లోకి వలసలను ఆహ్వానిస్తున్నారు. 

ఇటీవల షర్మిల సమక్షంలో అధికార టీఆర్ఎస్ (TRS)తో పాటు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల నాయకులు వైఎస్సార్ టిపి లో చేరారు.  రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మార్వో రవికుమార్, బీజేపీ నాయకులు రవి వైఎస్సార్ టిపి కండువా కప్పుకున్నారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ ముజాహిద్, నారాయణపేట్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమకారుడు మదివల కృష్ణ, వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగసముద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ ఎల్లప్ప తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ టిపిలో చేరారు

Follow Us:
Download App:
  • android
  • ios