కాలికి గాయమై ఇబ్బంది పడుతున్న మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇదే సమయంలో విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి షోలు వుంటే చెప్పాలన్న కేటీఆర్‌పై ఆమె సెటైర్లు వేశారు.  

టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలికి స్వల్ప గాయమైంది. మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరుతుండగా కాలు మెలిక పడింది. దీంతో నొప్పిని భరిస్తూనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాతో (anand mahindra) కలిసి అక్కడే భోజనం చేశారు. అయితే నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఎడమకాలి చీలమండలో చీరిక ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు.. మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. తాను గాయపడిన విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. 

కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పడుతున్నారు. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇదే సమయంలో విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి షోలు వుంటే చెప్పాలన్న కేటీఆర్‌కు షర్మిల సెటైర్లు వేశారు. మీ కోసం కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ బరెస్ట్, నీట మునిగిన ఇళ్లు, పంప్‌హౌస్‌లు వున్నాయని ఆమె అన్నారు. 

Scroll to load tweet…