వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన నేపథ్యంలో కాసేపట్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియా ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఆమె ఏం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. 

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి ఆయన కుమార్తె , వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద తల్లి విజయమ్మ, సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ , ఇతర కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల నివాళుర్పించారు. 

Also REad:వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా.. కాసేపట్లో మీడియా ముందుకు షర్మిల

మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ (ys vijayamma) రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ (ysrcp plenary) వేదికపై నుంచే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల శ్రమిస్తున్నారని.. ఈ క్రమంలో తాను ఆమెతోనే వుండేందుకు నిర్ణయించుకున్నానని విజయమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో వైఎస్ షర్మిల మీడియా ముందుకు రానున్నారు. దీంతో ఆమె ఏం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.