Asianet News TeluguAsianet News Telugu

‘ఇంకెంతమందిని బలి తీసుకుంటే మీ కండ్లు చల్లబడతాయి’... రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల...

ఇవ్వాళ మరో ఇద్దరు రైతులు చనిపోయారని.. ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడతాయి KCR అని ప్రశ్నించారు. ఇంకెంత మందిని బలితీసుకుంటారని నిలదీశారు. రైతులను కోటీశ్వరులను చేశామని, కార్లలో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అని వ్యాఖ్యానించారు.

ysrtp leader ys sharmila tweet on farmers, and srikantacharya
Author
Hyderabad, First Published Dec 3, 2021, 2:12 PM IST

హైదరాబాద్ : వడ్లను రోడ్లమీద కళ్ళల్లో పెట్టుకుని farmers నిరీక్షణ చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధినేత ys sharmila టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండిపడ్డారు. ఎప్పుడు కొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయన్నారు. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి అన్నారు.

ఇవ్వాళ మరో ఇద్దరు రైతులు చనిపోయారని.. ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడతాయి KCR అని ప్రశ్నించారు. ఇంకెంత మందిని బలితీసుకుంటారని నిలదీశారు. రైతులను కోటీశ్వరులను చేశామని, కార్లలో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అని వ్యాఖ్యానించారు.

ఒక్కసారి ఫాంహౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుందని... రైతులు కోటీశ్వరులు కావడం కాదు తమరు ఉరి వేస్తున్నారని అన్నారు. తమరు పంట కొనక రైతులను కాటికి పంపుతున్నారని వైఎస్ షర్మిల కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇదే క్రమంలో మరో ట్వీట్ చేస్తూ.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 
Srikanthachari ఘన నివాళి అంటూ మరో tweet చేశారు వైయస్ షర్మిల. తెలంగాణ కోసం నీ ఆత్మబలిదానం వృధా కాదు మిత్రమా.. నీవు కోరుకున్న తెలంగాణ లో రాబందుల రాజ్యం నడుస్తుంది.. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి నిరంకుశ పాలన సాగిస్తున్నారు.

ఉద్యమ ఆశయాలు అయినా నీళ్లు, నిధులు, నియామకాలను పక్కన పెట్టారు.  శ్రీకాంతాచారి ఆశయసాధనకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుంది.. అంటూ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల. 

కేసీఆర్ పై ఈటల గెలుపు... వేములవాడ రాజన్నకు నిలువెత్తు బంగారం సమర్పించిన అభిమాని

అంతకుముందు నవంబర్ 29న కరోనా థర్డ్ వేవ్ గురించి ముందస్తు జాగ్రత్తలు చెబుతూ ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో సరైన వైద్యం అందక.. హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోక.. చాలా మంది ఇబ్బంది పడ్డారని.. ఆ సమస్య మళ్లీ రాకుండా చూడాలంటూ.. ఆమె సీఎం కేసీఆర్ ని కోరారు.

‘కరోనా 2nd వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతుంటే పారాసిటమోల్ వేసుకంటే సరిపోతుందని  ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో ‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడండి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. ప్రతి ఒక్కరికి corona రెండు డోసులు vaccine అందేలా చెయ్యండి. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి. ’ అంటూ మరో ట్వీట్ చేశారు.

అయితే..  ఆమె చేసిన ట్వీట్స్ కి కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు మాత్రం రివర్స్ లో కౌంటర్లు వేస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. బ్లీచింగ్ పౌడర్ చల్లమని, పారాసెటమాల్ వేసుకోమనే చెప్పారని.. ఆమెకు గుర్తు చేస్తూ కౌంటర్లు వేయడం గమనార్హం. ఆ ట్వీట్స్ కూడా వైరల్ అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios