పోలీసుల భుజంపై తుపాకీ పెట్టి నా పాదయాత్రను అడ్డుకుంటున్నారు: కేసీఆర్‌పై వైఎస్ షర్మిల

తన పాదయాత్రకు  ప్రజల నుండి వస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న  స్పందనను చూసిన  ఓర్వలేక  అడ్డుకొనే ప్రయత్నం  చేస్తున్నారని  వైఎస్  షర్మిల ఆరోపించారు. ఇందుకు పోలీసులను కేసీఆర్  సర్కార్  వాడుకుంటుందని  ఆమె ఆరోపించారు. 

 YSRTP chief  YS Sharmila Serious comments  on KCR


హైదరాబాద్:పోలీసుల భుజంపై తుపాకీని పెట్టి  తన పాదయాత్రను ఆపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రయత్నిస్తున్నారని  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్  షర్మిల హైద్రాబాద్ లో ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తనకు వరంగల్  పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని షర్మిల చెప్పారు. ఈ  షోకాజ్ నోటీసులకు ఇావాళ  సాయంత్రానికి పోలీసులకు సమాధానం చెబుతామన్నారు షర్మిల.  నిన్న రాత్రి పదకొండున్నర గంటల వరకు తమ పార్టీ నేతలను తమ కార్యాలయంలోనే ఉంచుకున్న పోలీసులు అనుమతిని ఇవ్వలేదని  షర్మిల గుర్తు చేశారు.  పోలీసుల షోకాజ్ కు తాము సమాధానం ఇచ్చిన తర్వాత  పోలీసుల నుండి  ఎలాంటి  రిప్లై వస్తుందోనని  చూస్తామన్నారు. ఈ  కారణంగా రేపు కూడా పాదయాత్ర  నిర్వహించే విషయంపై స్పష్టత లేదన్నారు. 

తాను బాధితురాలినని  వైఎస్  షర్మిల చెప్పారు. బాధితురాలే క్షమాపణ ఎలా చెబుతుందని  ఆమె ప్రశ్నించారు.  తన బస్సును దగ్దం చేశారన్నారు. తనను  కారులో  ఉంచి క్రేన్ సహయంతో  పోలీసులు తీసుకెళ్లారన్నారు.అంతేకాదు తనను ఇష్టారీతిలో  టీఆర్ఎస్  నేతలు దూషించారని  షర్మిల గుర్తు చేశారు.ఈ వ్యాఖ్యలు చేసినందుకు టీఆర్ఎస్  నేతలు క్షమాపణలు చెప్పారా అని షర్మిల ప్రశ్నించారు. 

టీఆర్ఎస్  నేతలు  తాలిబన్ల మాదిరిగా  మాట్లాడారని  వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకే  తాను తాలిబన్ల రాజ్యం అని వ్యాఖ్యలు చేసినట్టుగా షర్మిల చెప్పారు.తనపై టీఆర్ఎస్ నేతలు  ఏం చేసినా  ఎదుర్కొనేందుకు సిద్దంగా  ఉన్నానని షర్మిల చెప్పారు.  అయితే పోలీసులను కేసీఆర్ వాడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.  పోలీస్ వ్యవస్థ టీఆర్ఎస్ కు  అనుకూలంగా  మారిందని షర్మిల చెప్పారు. ఈ విషయాలను ప్రజలు గమనించాలని ఆమె కోరారు.

also read:ప్రజా ప్రస్థానానికి బ్రేక్:వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసుల అనుమతి నిరాకరణ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  పాదయాత్ర సజావుగా  సాగుతున్న  విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. తన పాదయాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన  వస్తుందని  చెప్పారు. అందుకే  తన పాదయాత్రను అడ్డుకొనేందుకు  ప్రభుత్వం ప్రయత్నిస్తుందని  షర్మిల తెలిపారు. తన పాదయాత్రకు  పోలీసుల నుండి  అనుమతి రాకపోతే  కోర్టు ధిక్కార  పిటిషన్ ను కూడా  వేస్తానని  షర్మిల తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios