కౌలు రైతులు రైతే కాదని  తెలంగాణ ప్రభుత్వం చెప్పడం సరైందేనా అని వైఎస్ఆర్‌టీపీ వైఎస్ షర్మిల  ప్రశ్నించారు.

హైదరాబాద్: కౌలు రైతులకు Telangana ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.మంగళవారం నాడు YSRTP చీఫ్ YS Sharmila హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌలు రైతు కూడా రైతేనని ఆమె చెప్పారు. కౌలు రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఇవ్వడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది కౌలు రైతులున్నారని ఆమె చెప్పారు. కౌలు Farmers రైతే కాదని చెప్పడంలో అర్ధం లేదన్నారు. 

 రాష్ట్రంలో 66లక్షల మంది రైతులు అని చెప్తున్న కేసీఆర్ 42 లక్షల మందికే ఇన్సూరెన్స్ ఎందుకు కట్టారని ఆమె ప్రశ్నించారు. బంగారు భారతదేశం అంటూ కేసీఆర్ జోకులు బానే వేస్తున్నారని ఆమె సెటైర్లు వేశారు. బంగారు తెలంగాణ ఎక్కడ ఉందని ఆమె అడిగారు. తెలంగాణలో బడులు, గుడుల కంటే వైన్స్ షాపులే ఎక్కువేనని ఆమె చెప్పారు. తాగుబోతుల, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. 

కాంట్రాక్టు ఉద్యోగులు ఉండవు, అందరి రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ ఏం చేశారని షర్మిల అడిగారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్న విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బంగారు తెలంగాణ కాదు, బతుకే లేని తెలంగాణ చేశారన్నారు.ఒకప్పుడు కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయిందని, కానీ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగలేదన్నారు. మీరు కమిషన్లు తీసుకొని మీ కుటుంబమే బాగుపడితే దాన్ని బంగారు తెలంగాణ అనరన్నారు. 

కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి నీళ్లను ఎత్తి సముద్రంలో పోస్తున్నారన్నారు. ఒక్కసారి ప్రగతి భవన్, ఫామ్ హౌస్ బయటకు వచ్చి చూస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు.కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇంటగెలిచి రచ్చ గెలవాలి అంటారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను గెలిపించుకున్నందుకే ప్ఏరజలుడుస్తున్నారు.ఇక దేశాన్ని ఏలతాడు అనేది పెద్ద జోక్ అంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.కనీసం రైతులకు నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. .దళితులకు తెలంగాణలో అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయన్నారు. దళితులు చనిపోయేలా చేస్తున్నారని ఆమె కేసీఆర్ తీరును ప్రశ్నించారు. మహిళలకు గౌరవం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. మొన్నటిదాకా మహిళ మంత్రి, మహిళ కమిషనే లేదని చెప్పారు. 

ఎవరి బెదిరింపులకు భయపడం, పార్టీ పెట్టాం, పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే తెలంగాణ కు అంత మంచిదని ఆమె చెప్పారు. ప్రజల సమస్యలపై మాట్లాడకుండా సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె కేసీఆర్ పై మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆమె చెప్పారు.కేసీఆర్ కేటీఆర్ లు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతారని చెప్పారు. బీజేపీ, టీఆరెస్ లకు తేడా ఏమీ ఉందని ఆమె ప్రశ్నించారు.