Asianet News TeluguAsianet News Telugu

కుట్ర చేసి వైఎస్ఆర్ ను చంపారు, నన్ను కూడా ...: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలనం

తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.  ఇదే విధంగా తనను కూడా చంపే ప్రయత్నిస్తున్నారన్నారు. 

YSRTP Chief YS Sharmila Sensational Comments On YSR Death
Author
First Published Sep 18, 2022, 11:51 AM IST

హైదరాబాద్: తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని  వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తరహలోనే తనను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ బిడ్డను, నాకు భయం లేదన్నారు. తాను పులి బిడ్డను అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆమె కేసీఆర్ ను కోరారు.  తనను ఎదుర్కోలేక స్పీకర్ కు పిర్యాదు చేశారని ఆమె మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారని ఆమె ఆరోపించారు. బేడీలకు తాను భయపడబోనని తేల్చి చెప్పారు.

పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని  ప్రశ్నిస్తే తప్పా అని ఆమె అడిగారు. తన విమర్శలకు సమాధానం చెప్పుకోలేక తనపై  స్పీకర్ కి పిర్యాదు చేశారన్నారు. ఇదే ఐకమత్యం పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఎందుకు చూపలేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. 

8 ఏళ్లుగా ప్రాజెక్ట్ పూర్తి చేయక పోతే ఐకమత్యం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పాలమూరు ప్రాజెక్ట్ దక్షిణ  తెలంగాణ కి ఎంతో కీలకమన్నారు. జిల్లాకు చెందిన  ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి అటక ఎక్కించారని ఆమె ఆరోపించారు. 

ఈ ప్రాజెక్టు  విషయంలో ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు పోరాడలేదని ఆమె చెప్పారు. అసెంబ్లీ లో కనీసం ప్రస్తావించలేదని విమర్శించారు.  12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్  గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ సహ ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై విచారణ చేసే దమ్ముందా అని షర్మిల అడిగారు. మీకు దమ్ముంటే తనపై విచారణ చేయాలన్నారు. ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఆమె చెప్పారు. 

also read:నాపై ఆరోపణలు రుజువు చేస్తే ఆస్తులన్నీ పేదలకు ఇస్తా: వైఎస్ షర్మిల విమర్శలకు ఆళ్ల కౌంటర్
తన పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతున్నందున ఈ పాదయాత్రను నిలిపివేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన  పాదయాత్ర తో  ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడిందని షర్మిల అభిప్రాయపడ్డారు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ కట్టడి చెయ్యడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మీకు దమ్ముంటే తన పాదయాత్రను ఆపాలన్నారు. 

తనపై మంత్రి నిరంజన్ రెడ్డి పిర్యాదు చేస్తే వెంటనే  కేసు నమోదు చేశారన్నారు. కానీ మంత్రి  నిరంజన్ రెడ్డిపై తాను  పిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. 
ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమేనని ఆమె విమర్శలు గుప్పించారు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పాలమూరులో పాదయాత్ర సమయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై ఆమె విమర్శలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి నిరంజన్ రెడ్డిపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు నిరుద్యోగ సమస్యపై ఆందోళనలు  నిర్వహించడంపై  మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలను దృష్టిలో ఉంచుకొని వైఎస్ షర్మిల తన  పాదయాత్ర సందర్భంగా నిరంజన్ రెడ్డిపై విమర్శుల ఎక్కు పెట్టారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.  మంత్రితో పాటు ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేసిన షర్మిలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు ప్రజా ప్రతినిధులు. అయితే  తనపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొంటే న్యాయపరంగా ఎదుర్కొంటామని రెండు రోజుల క్రితం షర్మిల ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios