Asianet News TeluguAsianet News Telugu

వైటిపి ఆఫీస్ లో తెలంగాణ పిండివంటల ఘుమఘుమలు... స్వయంగా సకినాలు వండిన షర్మిల (వీడియో)

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు వైఎస్సార్ టిపి కార్యాలయం తెలంగాణ వంటకాలతో ఘుమఘుమలాడిపోయింది. 

 YSRTP Chief YS Sharmila prepraring telangana food items AKP
Author
First Published Jun 2, 2023, 5:16 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడులకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేపట్టగా బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ తో పాటు అన్నిపార్టీలు ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నాయి. ఇలా వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. స్వయంగా పార్టి అధినేత్రి షర్మిల తెలంగాణ పిండివంటల్లో ప్రత్యేకమైన సకినాలు చేసారు. తన చేత్తోనే పిండి తీసుకుని సకినాలు తయారుచేసిన షర్మిల వాటిని నూనెలో వేయించారు. ఇలా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో లోకల్ స్టైల్ పిండివంటలు వండారు వైసిపి మహిళా నాయకులు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేయడంతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షురాలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలవద్ద పూలుజల్లి దండం పెట్టుకున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు షర్మిల డబుల్ కా మీటా పంచిపెట్టారు. 

వీడియో

అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షర్మిల ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ''నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై కొట్లాడితే వచ్చింది "తెలంగాణ". అమరవీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితం "తెలంగాణ". అయితే  ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్న వేళ... దొరల పాలన మళ్లీ వచ్చిన యాళ్ల, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే వైఎస్సార్ తెలంగాణ పార్టీ'' అంటూ కవితాత్మకంగా తన పార్టీ ఏర్పాటుగురించి చెప్పారు. 

Read More  ఆరు దశాబ్దాల పోరాటం.. తెలంగాణ ఆవిష్కరణలు, స్టార్టప్‌ల కేంద్రంగా ఎదుగుతోంది : రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము

''నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి.. గెలిచి నిలిచింది వైఎస్సార్ టిపి. అన్నం మెతుకులు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాల నిలబడింది. నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా నిలిచింది. రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల అప్పులకుప్ప చేస్తే ఎదురు నిలిచి ప్రశ్నించింది. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా.. మొక్కవోని దీక్షతో పోరాటం చేసింది'' అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు షర్మిల. 

''నీటి వాటాల్లో అన్యాయం జరిగితే, కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకుంటే.. నిస్వార్థంగా ఉద్యమించింది. 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి, కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టింది. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై గొంతెత్తింది'' అన్నారు. 

''ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలి. సర్కారు మారితేనే బతుకులు మారుతాయి. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావాలన్నా వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి. జలయజ్ఞం ద్వారా జలసిరులు కురవాలి. అర్హులకు పోడు పట్టాలు అందాలి. పేదలకు భూములు దక్కాలి. దళిత, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలి. ప్రజలు అభివృద్ధి బాట పట్టాలి. సబ్బండ వర్గాలకు సంక్షేమం చేరాలి. ఇందుకోసం వైయస్ఆర్ బిడ్డ కట్టుబడి ఉంది'' అంటూ షర్మిల ట్వీట్ చేసారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios