వైఎస్ఆర్‌టీపీ కార్యాలయానికి భూమి పూజ: పాలేరు నుండి పోటీకి షర్మిల ప్లాన్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌టీపీ  చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు.  ఈ మేరకు ఇవాళ ఉదయం వైఎస్ఆర్‌టీపీ  కార్యాలయానికి షర్మిల  భూమి పూజ చేశారు.

YSRTP Chief YS Sharmila  lays Foundation To  Party Office  at  Palair

 
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో  వైఎస్ఆర్‌టీపీ  కార్యాలయానికి  ఆ  పార్టీ చీఫ్  వైఎస్ షర్మిల శుక్రవారంనాడు భూమి పూజ చేశారు. పాలేరులోని కరుణగిరి చర్చికి సమీపంలో  పార్టీ కార్యాలయం  నిర్మాణానికి  షర్మిల భూమిపూజ చేశారు.ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  పోటీ చేయాలని షర్మిల ప్లాన్  చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో  పార్టీ కార్యాలయం మాత్రమే ఉంది.  హైద్రాబాద్ తర్వాత పాలేరులో మాత్రమే వైఎస్ఆర్‌టీపీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.  ఇవాళ పాలేరులో  వైఎస్ఆర్‌టీపీ కార్యాలయానికి షర్మిల భూమి పూజ చేశారు.

వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు  ఒంటరిగా పోటీ చేస్తామని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల గతంలోనే ప్రకటించారు. ఒంటరిగానే  తాము పోటీ చేస్తామని  షర్మిల ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని  షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాలేరులో  వైఎస్ఆర్ టీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు.

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి   కందాళ ఉపేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  2018 ఎన్నికల సమంలో  కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసి అప్పటి మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర్ రావుపై విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో   ఉపేందర్ రెడ్డి బీఆర్ ఎస్ లో  చేరారు.  వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరర్ రావు  ప్లాన్ చేసుకుంటున్నారు.  అయితే సిట్టింగ్ లకే  ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని  సీఎం కేసీఆర్ గత నెలలో నిర్వహించిన  పార్టీ సమావేశంలో  ప్రకటించారు. అయితే  పాలేరు నుండి టికెట్ ఎవరికి దక్కుతుందనే  ఉత్కంఠ నెలకొంది.

 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి  ఉప ఎన్నిక సమయంలో  సీపీఐ, సీపీఎంలు  మద్దతు ప్రకటించారు. దీంతో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం  ప్రకటించారు.  గతంలో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్, సీపీఎం అభ్యర్ధులే ప్రాతినిథ్యం వహించారు.  దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీ చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.  పాలేరులో  పోటీకి  సీపీఎం నాయకత్వం రంగం సిద్దం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే  ఇదే స్థానం నుండి  వైఎస్ షర్మిల కూడా  పోటీ చేయనున్నారు. దీంతో  పాలేరు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని  షర్మిల నిర్ణయం తీసుకున్నారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios