వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. నియంత పాలన పోతేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారంటూ మండిపడ్డారు. ప్రజాప్రస్థాన యాత్రంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు.
భువనగిరి : తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే KCR నియంత పాలన పోవాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత ys sharmila అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గెలిచినవారు టిఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఇది రాజకీయ వ్యభిచారం అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె చేపట్టిన Prajaprastana Yatra బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం, మార్కెట్ పల్లి, సంగెం గ్రామాల్లో కొనసాగింది.
గోకారం గ్రామం వరకు 300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా దివంగత YS Rajasekhara Reddy విగ్రహాన్ని YSRTP అధినేత YS Sharmila ఆవిష్కరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఎరువుల సబ్సిడీతో పాటు పంట నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కొనసాగించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకురావడం కోసమే తాను పార్టీని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రజలు అవకాశం ఇస్తే నమ్మకంగా పని చేస్తామని ప్రతి మహిళకు ఇల్లు ఇచ్చి.. వారి పేరు మీదనే ఉండేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సత్యవతి, పార్టీ జీహెచ్ఎంసీ కోఆర్డినేటర్ రాజగోపాల్, జిల్లా కోఆర్డినేటర్ మహమ్మద్ అతహర్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, మార్చి 4న తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు ఎందుకు సహాయం చేయరని YSRTP అధ్యక్షురాలు YS Sharmila ప్రశ్నించారు. తెలంగాణ సీఎం KCR జార్ఖండ్ టూర్ పై షర్మిల స్పందించారు. గల్వాన్ లోయలో China తో జరిగిన ఘర్షణలో మరణించిన Army కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలను అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు.ఈ హామీ మేరకు Jharkjhand రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆర్మీ జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు రూ. 10 లక్షల చెక్ ను అందించారు.
ఈ విషయమై షర్మిల మాట్లాడారు. అమర జవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వడం తప్పు కాదన్నారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడం తప్పు లేదన్నారు. కానీతెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందకు సహాయం చేయరని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలను అర్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ కోసం విద్యార్ధి, యువజనులు ప్రాణాలు అర్పించడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
అంతకుముందు రోజు మార్చి 3న ''ధరణి భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం అని చెప్పుకున్న కేసీఆర్ గారు, ఉన్న సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు, లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారంటూ ట్వీట్ చేశారు.
భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుని కొందరు చనిపోతే, కాస్తు కాలాన్ని ఎత్తేస్తే పాత పేర్ల మీద రికార్డులు చూపటంతో ఆ భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు. లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకొన్నా వాటిని పరిష్కరిస్తే మీ పనికిమాలిన పని ఈ ధరణి (అని తేలిపోతుందని భయపడుతున్నారా? మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి'' అని షర్మిల విమర్శలు చేశారు.
