ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్ కు షర్మిల పది ప్రశ్నలు
ఏం సాధించారని తెలంగాణ ధశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వైఎస్ షర్మిల కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈ మేరకు పది ప్రశ్నలకు కేసీఆర్ కు ఆమె సంధించారు.
హైదరాబాద్:దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు తాను లేవనెత్తే పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. గురువారంనాడు గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఅర్ మోసం చేస్తున్నారన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ 4.5లక్షల కోట్ల అప్పులు చేశారని ఆమె గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టారని షర్మిల వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షన్నర కోట్లు కేసీఅర్ దోచుకున్నాడని ఆమె ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో మరో దోపిడీకి పాల్పడ్డారన్నారు.
తెలంగాణ సొమ్మంతా కేసీఅర్ దోచుకున్నాడన్నారు. ఈ దోపీడీ సొమ్ముతో బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని షర్మిల పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఫైనాన్స్ చేసే స్థాయిలో సొమ్మును దోచుకున్నారని కేసీఆర్ పై ఆమె ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం సాగే సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. తాను తన భార్య తప్ప ఎవరూ లేరన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ కుటుంబమంతా దిగిపోయిందన్నారు.
also read:వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయం, ఆ పార్టీలతో పొత్తుల్లేవు : తేల్చేసిన వైఎస్ షర్మిల
ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు షర్మిల. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన హామీ ఏమైందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ మోసగించారని షర్మిల విమర్శించారు. తెలంగాణలో 36 లక్షల మందికి సొంత ఇండ్లు లేవన్నారు. కేసీఅర్ సర్కార్ 26 వేల ఇండ్లు ఇస్తే..36 లక్షల మందికి న్యాయం చేసినట్టు అవుతుందా అని షర్మిల అడిగారు. దళిత బంధులో సగం ఎమ్మెల్యేలు తింటున్నారని ఆమె ఆరోపించారు. 9 ఏళ్లలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారో చెప్పాలన్నారు.
కేసీఆర్ కు షర్మిల సంధించిన ప్రశ్నలు
10 ఎండ్లలో ఉద్ధరించినట్లు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు
ఎందుకోసం ఉత్సవాలు.. ఏం సాధించారని ఉత్సవాలు..?
కేసీఅర్ కి దమ్ముంటే మా 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి
10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు .?
10 ఏళ్ల క్రితం మీ ఆస్తులు ఎన్ని..? ఎప్పుడు ఎన్ని..?
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమయ్యింది .?
2014 నుంచి 2023 వరకు ఎన్ని భూములు అమ్మారు? 30 వేల ఎకరాలు అమ్మిన మాట నిజం కాదా..?
కోటి ఎకరాల మాగాణి ఇస్తామని చెప్పి ఎన్ని ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు..?
కేజీ టూ పీజీ ఉచిత విద్యుత్ హామీ ఎక్కడ పోయింది
రైతులు కోటేశ్వరులు అయితే 9 వేల మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు
తెలంగాణ లో అమర వీరుల పరిస్థితి ఎంటి..?