Asianet News TeluguAsianet News Telugu

బోడుప్పల్‌లో షర్మిల దీక్షకు అనుమతి నిరాకరణ: వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తల ఆందోళన


హైద్రాబాద్ బోడుప్పల్ లో వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో  వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. షర్మిల దీక్షకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. స్థానిక ఎమ్మెల్యే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దీక్షను అడ్డుకొంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

Ysrcp workers conducts  protest  at boduppal in hyderabad
Author
Hyderabad, First Published Sep 21, 2021, 9:56 AM IST

హైదరాబాద్: హైద్రాబాద్ లోని బోడుప్పల్ లో వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దీక్షకు పోలీసులు అనుమతికి నిరాకరించారని ఆరోపిస్తూ దీక్షాస్థలం వద్దే వైఎస్ఆర్‌టీటీపీ కార్యకర్తలు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు.

ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ కుటుంబాలను పరామర్శించి వైఎస్ షర్మిల దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఇవాళ బోడుప్పల్ లో దీక్షకు వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకొంది. అయితే బోడుప్పల్ లో షర్మిల దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో దీక్షా చేయాల్సిన స్థలంలోనే ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్‌టీపీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios