టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి. రవిప్రకాశ్ లాంటి కొందరు చీడ పరుగుల వల్లే  తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందంటూ ట్వీట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.

టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రవిప్రకాశ్ లాంటి కొందరు చీడ పరుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ట మసకబారిందంటూ ట్వీట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.

ఆయన ఏం చెప్పారంటే.. పరారీలో ఉన్న రవిప్రకాశ్ తనతో పాటు కొన్ని ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్ తీసుకెళ్లినట్టు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాశ్ తక్షణం పోలీసులకు లొంగి పోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది.

శ్రీని రాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాశ్. బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్ లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా స్పై క్యామ్ తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెబ్తారు.

రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారింది. వీళ్ల బారినుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుంది. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆతర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లింది.

రవిప్రకాష్‌ సృష్టించిన గరుడ పురాణం శివాజి కూడా టివీ9 కేసుల్లో ఇరుక్కున్నాడు. రవిప్రకాష్‌ తనకు కొన్ని షేర్లు అమ్మి మోసం చేశాడని ఈ బ్రోకర్ ట్రిబ్యునల్‌కు వెళ్ళాడు. దీని వెనక రవిప్రకాష్ ఉన్నాడు. TV9 బోర్డులోకి కొత్త యాజమాన్యం ప్రతినిధులు రాకుండా ఆఖరి నిమిషంలో ఆడిన నాటకం.

సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలి. అమరావతిలో భూముల కొనుగోళ్లు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడు? శివాజి గరుడ పురాణం ఒక కుట్ర. శివాజి టివి9 ఆఫీసులో ఏం చేస్తుంటాడో విచారణ జరగాలి.

‘మెరుగైన సమాజం కోసం’ పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు.

కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు. మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది.

చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవి ప్రకాష్‌పై దర్యాప్తు జరగాలి.

ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్కిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్ర చందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడ ఉండటం దారుణమని విజయసాయి ట్వీట్ చేశారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…