ఆంధ్రప్రదేశ్‌లోని నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. 

యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) అన్నారు. రోజా శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఈకాలంలో ఎవరికి దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌కు లభించిందన్నారు. గతంతో పోలిస్తే వైభవంగా ఆలయ పునర్నిర్మాణం చేశారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణానికి వాడే గ్రానైట్ గుంటూరు నుంచి తెచ్చారని అన్నారు. ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. 

కేసీఆర్ నిజంగా కారణజన్ముడు అని రోజా చెప్పుకొచ్చారు. భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. లక్ష్మి నరసింహా స్వామి చాలా పవర్‌ఫుల్.. ఇంత పెద్ద గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాల్నారు. కాబట్టే సీఎం అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు.