పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశాడు. ఇకపై తమ్ అధ్యక్షుడు జగన్ పై పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. వైఎస్ జగన్ స్థాయి, చరిష్మా ఏంటో ప్రజలకు తెలుసు అని అన్నారు. 

పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయారు. అలాంటి వ్యక్తికి పవన్ ని విమర్శించే హక్కు ఎలా ఉంటుందనిశ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ సత్తా ఏంటో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు. తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ పై అక్రమంగా కేసులు పెట్టారు. అయినా మనోధైర్యం కోల్పోకుండా జగన్ 9 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉన్నారు అని శ్రీధర్ రెడ్డి తెలిపారు. 

గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసిపి తిరుగులేని విధంగా 151 సీట్లని కైవసం చేసుకుంది. టిడిపి 23 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది జనసేన పార్టీ కేవలం 1 సీటుని మాత్రం దక్కించుకోగలిగింది.