వైఎస్సార్ సన్నిహితుడు సూరీడు మీద జూబ్లీహిల్స్ లో హత్యాయత్నం జరిగింది. అల్లుడే ఇంట్లోకి చొరబడి క్రికెట్ బ్యాట్ తో సూరీడు మీద దాడికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు అల్లుడు సురేంద్రనాథ్ మీద కేసు నమోదు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు సూరీడుపై జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లోనే అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ క్రికెట్ బ్యాట్‌తో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ అల్లుడు ఈ ఘాతుకానికి ప్రయత్నించాడు.
సూరీడు కుమార్తె గంగా భవానీని సురేంద్రనాథ్ కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భర్త వేధింపులు భరించలేక భవానీ పుట్టింటికి వచ్చేసి అతడిపై గృహ హింస కేసు పెట్టింది. తనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలంటూ సురేంద్రనాథ్ భార్య భవానీ, మామ సూరీడు మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు.
దీనికి వారు నిరాకరించడంతో కక్ష పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఆయన దాడికి పాల్పడగా అప్పుడు సూరీడు తప్పించుకున్నాడు. దీంతో బరితెగించిన సురేంద్రనాథ్ ఏకంగా ఇంటికే వచ్చి దాడి చేయడం కలకలం రేపుతోంది. గంగా భవానీ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు సురేంద్రనాథ్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.