చంచల్ గూడ జైలుకు  వైఎస్ విజయమ్మ  చేరుకున్నారు.  వైఎస్  షర్మిలను  విజయమ్మ పరామర్శించారు.  పోలీసులపై దాడి  కేసులో  వైఎస్ షర్మిలను  పోలీసులు   నిన్న  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: చంచల్ గూడ జైలుకు వైఎస్ విజయమ్మ మంగళవారంాడు చేరుకున్నారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిలను హాజరుపర్చారు. వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. దీంతో సోమవారంనాడు రాత్రి నాంపల్లి కోర్టు చంచల్ గూడ జైలుకు వైఎస్ షర్మిలను తరలించాలని ఆదేశించింది. దీంతో నిన్న రాత్రే చంచల్ గూడ జైలుకు షర్మిలను తరలించారు.

also read:పోలీసులపై దాడి:వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు నిన్న వైఎస్ షర్మిల ప్రయత్నించారు. వైఎస్ షర్మిల ను లోటస్ పాండ్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు . సిట్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులుు అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఆమె దాడి చేశారు. ఈ విషయమై ఎస్ఐ రవీందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.