తెలంగాణలో పార్టీ స్థాపన ఏర్పాట్లలో బిజీగా వున్న వైఎస్ షర్మిల.. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు షర్మిల. తెలంగాణలోని వివిధ అంశాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇందుకోసం 11 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కులాలకు, మతాలకు అతీతంగా తెలుగువారందరినీ వైఎస్ఆర్ ప్రేమించారని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన కోసం మరణించిన వారిలో తెలంగాణ వారే అధికంగా వున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ ప్రశ్నలు ఇవే..?

  1. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేంటీ.?
  2. ఈ కష్టాలను ఏ విధంగా పరిష్కరించాలి..?
  3. మీ అసెంబ్లీ పరిధిలో వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులు ఏవి..?
  4. పార్టీ ఏర్పాటు గురించి జనం ఏమనుకుంటున్నారు..?
  5. టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి..?
  6. బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి..?
  7. తెలంగాణ ఉద్యమకారులు ఏమంటున్నారు..?
  8. బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే పోరాడాల్సిన అంశాలేంటీ..?
  9. సంస్థాగతంగా బలపడేందుకు చేయాల్సిన పనులేంటీ..?