Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడండి.. కేసీఆర్ కి షర్మిల రిక్వెస్ట్..!

కరోనా సెకండ్ వేవ్ లో సరైన వైద్యం అందక.. హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోక.. చాలా మంది ఇబ్బంది పడ్డారని.. ఆ సమస్య మళ్లీ రాకుండా చూడాలంటూ.. ఆమె సీఎం కేసీఆర్ ని కోరడం గమనార్హం

YS Sharmila Tweet Suggestion To CM KCR Over Corona Third wave
Author
hyderabad, First Published Nov 29, 2021, 1:28 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై... వైఎస్ షర్మిల.. రోజు రోజుకీ దూకుడు పెంచుతున్నారు. మొన్నటి వరకు.. నిరుద్యోగుల సమస్యలు, రైతుల కష్టాల గురించి ప్రస్తావిస్తూ.. అధికార పార్టీ పై విమర్శలు  చేసిన షర్మిల.. తాజాగా.. కరోనా థర్డ్ వేవ్ గురించి ముందస్తు జాగ్రత్తలు చెబుతూ ట్వీట్ చేయడం గమనార్హం.

కరోనా సెకండ్ వేవ్ లో సరైన వైద్యం అందక.. హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోక.. చాలా మంది ఇబ్బంది పడ్డారని.. ఆ సమస్య మళ్లీ రాకుండా చూడాలంటూ.. ఆమె సీఎం కేసీఆర్ ని కోరడం గమనార్హం.

 

‘కరోనా 2nd వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతుంటే
పారాసిటమోల్ వేసుకంటే సరిపోతుందని  ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో ‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడండి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యండి. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి. ’ అంటూ మరో ట్వీట్ చేశారు.

అయితే..  ఆమె చేసిన ట్వీట్స్ కి కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు మాత్రం రివర్స్ లో కౌంటర్లు వేస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. బ్లీచింగ్ పౌడర్ చల్లమని, పారాసెటమాల్ వేసుకోమనే చెప్పారని.. ఆమెకు గుర్తు చేస్తూ కౌంటర్లు వేయడం గమనార్హం. ఆ ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ కౌంటర్లకు ఆమె ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios