Asianet News TeluguAsianet News Telugu

దున్నపోతు మీద వానపడినట్లే.. కేసీఆర్‌లో చలనం లేదు.. మాకు ఒక్క అవకాశమివ్వండి: వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నా దున్నపోతు మీద వానపడినట్టే కేసీఆర్ చలనం లేదని అన్నారు. అందరికీ సొంత ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాల ఇవ్వడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని తెలిపారు.
 

ys sharmila slams kcr says peoples struggling to live
Author
Hyderabad, First Published Oct 30, 2021, 7:28 PM IST

హైదరాబాద్: Telangana రాష్ట్ర ప్రభుత్వంపై YSR తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతున్నదని విమర్శలు చేశారు. రెండు సార్లు కేసీఆర్‌ను గెలిపిస్తే ఏం చేశాడని అడిగారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మాటముచ్చట కార్యక్రమంలో YS Sharmila ప్రజలను కోరారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా దున్నపోతు మీద వాన పడుతున్నట్లే KCRలో చలనం లేదని విమర్శించారు.

ఇంకా ఒక అన్న మాట్లాడాడని, కండ్లలో నుంచి కన్నీళ్లకు బదులు రక్తం వస్తున్నదని ఆవేదన చెందాడని వైఎస్ షర్మిల అన్నారు. వాస్తవంలో ప్రజల పరిస్థితి ఇలా ఉంటే TRS ప్రభుత్వం మాత్రం ప్రజలు ఇబ్బందులే లేవని వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇల్లు అంటూ టీఆర్ఎస్ గొప్పలు పోతున్నదని, అవి ఎవరికైనా వచ్చాయా? అని అడిగారు.

Also Read: వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల.. సంతోషంగా ఉందంటూ కామెంట్స్..

పింఛన్లు కూడా రావడం లేదని, పింఛన్ లిస్టులో ఉన్నవాళ్లు బతికినంత కాలం రానేలేదని, ఆ లిస్టులో ఉండే వారు మరణిస్తున్నారనీ, కానీ, పింఛన్ మాత్రం రావడం లేదని ఆరోపణలు చేశారు. యువతనే కాదు, కేసీఆర్ ముసలివాళ్లనూ మోసం చేశాడని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు పింఛన్ రాక అవస్తలు పడుతున్నారని తెలిపారు.

విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, డిగ్రీ, పీజీలు చేసి టీ, టిఫిన్ సెంటర్లు, కూరగాయలు అమ్ముకుంటూ బతుకీడుస్తున్నారని షర్మిల అన్నారు. మరెంతో మంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగలేవని చెప్పారు. ఇంత జరుగుతన్న దున్నపోతు మీద వాటన పడినట్లే.. కేసీఆర్‌లో చలనం లేదని విమర్శించారు.

వైఎస్ఆర్ పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళలకు నేటి ప్రభుత్వం ఇస్తున్న రుణాలపై రూపాయి పావలా పడుతున్నదని వైఎస్ షర్మిల అన్నారు. అవి ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయని తెలిపారు. తెలంగాణలో నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌తో మేలు జరిగింది ఎవరికి? అని ప్రశ్నించారు. 20 ఎకరాలు భూమి ఉంటే 15 ఎకరాలే చూపెడుతున్నదని అన్నారు.

Also Read: 11వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర..

అందరికీ సొంత ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలలు తమ కాళ్ల మీద వారు నిలబడేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని, వైఎస్ఆర్ పాలన తిరిగి తేవడానికి తాము కట్టుబడి ఉన్నట్టు వైఎస్ షర్మిల వివరించారు.

వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందు.. యాంకర్ శ్యామల, తన భర్త నర్సింహ రెడ్డితో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి షర్మిలను కలిశారు. షర్మిల పార్టీ పెడితే చేరేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. షర్మిలతో కలిసి నడుస్తామని శ్యామల దంపతులు చెప్పారు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. యాంకర్ శ్యామల దంపతులు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక, శ్యామల.. యాంకర్‌గా, నటిగా రాణిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios