Asianet News TeluguAsianet News Telugu

రైతు హంతక ప్రభుత్వం మనకొద్దు.. సీఎం KCR పై YS Sharmila ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై   వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల( YS Sharmila)  తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో రైతుల ఆవేదనను తీర్చేవారే లేరని విమ‌ర్శించారు.  ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక రైతన్న‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై స‌ర్కారు డ్రామాలు ఆడుతోంద‌ని ఆమె అన్నారు. అందుకే  ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

YS Sharmila slams KCR Over farmers problems IN  Telangana
Author
Hyderabad, First Published Dec 24, 2021, 2:30 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై   వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల (YS Sharmila)  తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై స‌ర్కారు డ్రామాలు ఆడుతోంద‌ని ఆమె అన్నారు. రైతుల‌ను ఆదుకునే వారి లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఒక్కే రోజు ముగ్గురు రైతులు ఆత్మ‌హత్య చేసుకుంటే.. క‌నీసం ఆ కుటుంబాల‌ను ఓదార్చాల‌నే క‌నీసం ఇగితం కేసీఆర్ కి లేద‌ని విమ‌ర్శించారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి ముందుకు వ‌చ్చిన కేసీఆర్ .. తెలంగాణ లో రైతులు చ‌నిపోతే ప‌ట్టించుకోవ‌డానికి టైం లేదా అని ప్ర‌శ్నించారు. 
  
తాజాగా శుక్ర‌వారం ట్విట్టర్ వేదికగా ఆమె విమర్శలు ఎక్కపెడుతున్నారు. మరోసారి ట్విట్టర్ వేదికగా వైెఎస్ షర్మిళ.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో వ‌రుస ట్వీట్స్ చేస్తూ  విమ‌ర్శ‌లు గుప్పించారు. "  రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో,ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.పంట పండక,పెట్టుబడి రాక,అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు,ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి "అంటూ వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

" ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్ గారికి  మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం మీది. రైతును అప్పులపాలు చేస్తున్న ముఖ్యమంత్రి మనకొద్దు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకొద్దు "  అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 
 
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆదుకోవాల్సిన స‌ర్కార్ వరి మీద కిరికిరి పెడుతూ, కల్లాల్లో కయ్యాలు పెడుతూ, హస్తినలో దోస్తానా చేస్తూ.. ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులను చనిపోయేలా చేస్తున్న‌ది విమ‌ర్శించారు.  రైతులు చ‌నిపోతే కనీసం ఆ రైతు కుటుంబాలను ఓదార్చే దిక్కు లేదనీ,  రైతులను కోటీశ్వరులు చేశామని చెప్పుకొంటూ.. రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నఈ రైతు హంతక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios