వైఎస్ షర్మిలకు బెయిల్: చంచల్ గూడ జైలు నుండి విడుదల
వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మంగళవారంనాడు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు.
హైదరాబాద్; వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మంగళవారంనాడు సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు వైఎస్ షర్మిల కు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులు సమర్పించడంతో చంచల్ గూడ జైలు నుండి వైఎస్ షర్మిలను విడుదల చేశారు జైలు అధికారులు.
పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు ఇవాళ మధ్యాహ్నం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టులో పోలీసులు ఆమెను హాజరుపర్చారు.
ఈ కేసులో వైఎస్ షర్మిలకు ఈ ఏడాది మే 8వ తేదీ వరకు జ్యుడీషీయల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. షర్మిల తరపు న్యాయవాది నిన్న రాత్రి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుపుతామని నాంపల్లి కోర్టు తెలిపింది.
also read:పోలీసులపై దాడి: వైఎస్ షర్మిలకు షరతులతో బెయిల్ మంజూరు
ఇవాళ ఉదయం నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిల తరపు న్యాయవాది,. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను నాంపల్లి కోర్టు విన్నది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులను కలిసేందుకు వెళ్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు నిన్న అడ్డుకున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ విషయమై పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగారు. పోలీసులపై దాడికి దిగారు. ఈ విషయ మై ఎస్ఐ రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులు సమర్పించారు. దీంతో ఇవాళ సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి వైఎస్ షర్మిల ను విడుదల చేశారు జైలు అధికారులు.