తెలంగాణలో పార్టీకి కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని షర్మిల భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ప్రయత్నాలను ప్రారంభించారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్టీకి కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని షర్మిల భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ప్రయత్నాలను ప్రారంభించారు.
తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల సన్నాహలు చేస్తున్నారు.ఈ సన్నాహల్లో భాగంగా షర్మిల వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
తొలి సమావేశం ఈ నెల 9వ తేదీన జరిగింది.ఈ నెల 20న ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం కానుంది షర్మిల. హైద్రాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని షర్మిల భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతొంది.
also read:ఖమ్మం జిల్లా నేతలతో భేటీ: ఈ నెల 20న షర్మిల సమావేశం
ఒకవేళ లోటస్ పాండ్ లో కార్యాలయం ఏర్పాటు సాధ్యం కాకపోతే మరో కార్యాలయాన్ని తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే పార్టీలో కొత్తవారికి అవకాశం కల్పించాలని షర్మిల భావిస్తున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీల నుండి వచ్చినవారి కంటే కొత్తవారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని షర్మిల భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
