Asianet News TeluguAsianet News Telugu

నా పార్టీలోకి వస్తే వద్దంటానా?: ఈటలకు షర్మిల ఆహ్వానం

 తమ పార్టీలోకి వస్తామంటే ఈటల రాజేందర్ ను ఆహ్వానిస్తామని వైఎస్ షర్మిల తేల్చి చెప్నారు.  బుధవారం నాడు  హైద్రాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 

YS Sharmila invites Etela Rajender into her party lns
Author
Hyderabad, First Published Jun 9, 2021, 1:15 PM IST


 హైదరాబాద్: తమ పార్టీలోకి వస్తామంటే ఈటల రాజేందర్ ను ఆహ్వానిస్తామని వైఎస్ షర్మిల తేల్చి చెప్నారు.  బుధవారం నాడు  హైద్రాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 

 టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం సాధారణమైందన్నారు. కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందని ఆమె చెప్పారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు.

also read:జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎజెండా: వైఎస్ షర్మిల

రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందని ఆమె వివరించారు. పార్టీ గుర్తుపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని ఆమె చెప్పారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. కరోనా విషయంలో ఇప్పటి వరకు కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే ఉద్యేశ్యం కేసీఆర్‌కు లేదని నిద్ర పోతున్నట్లు నటిస్తున్నారని ఆమె విమర్శించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios