Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ప్రభుత్వోద్యోగాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. మండిపడ్డ వైఎస్ షర్మిల...

.‘ఒక్క ఇంటికే 5 ఉద్యోగాలు తీసుకున్న మీకు నిరుద్యోగుల పట్ల భాద్యత ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ‘ఉద్యోగాల కోసం చస్తున్న నిరుద్యోగులు కళ్ళెర్ర చెస్తే మీ ఉద్యోగాలు పోతయి జాగ్రత్త!’ అంటూ హెచ్చరించారు. దీంతోపాటు ఇవ్వాల్టి పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ను షేర్ చేశారు షర్మిల.

YS Sharmila fires on minister ktr comments over employment of telangana youth
Author
Hyderabad, First Published Sep 28, 2021, 2:11 PM IST

తెలంగాణ(telangana)లో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల(Governament Jobs) విషయంలో మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల (YS Sharmila)ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘తండ్రి కేసీఆర్(KCR) 50వేల ఉద్యోగాల నొటిఫికేషన్ ఇస్తం అంటడు.. అల్లుడు హరీష్ రావు(Harish Rao) 75వే ఉద్యొగాల భర్తి అంటడు..కొడుకు KTR ప్రభుత్వ ఉద్యొగాలు లేవంటడు’.. అంటూ ఎద్దేవా చేశారు. 

అంతేకాదు...‘ఒక్క ఇంటికే 5 ఉద్యోగాలు తీసుకున్న మీకు నిరుద్యోగుల పట్ల భాద్యత ఉందా?’ అంటూ ప్రశ్నించారు. ‘ఉద్యోగాల కోసం చస్తున్న నిరుద్యోగులు కళ్ళెర్ర చెస్తే మీ ఉద్యోగాలు పోతయి జాగ్రత్త!’ అంటూ హెచ్చరించారు. దీంతోపాటు ఇవ్వాల్టి పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ను షేర్ చేశారు షర్మిల.

కాగా, తెలంగాణలో ఉపాధి కల్పనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ విప్లవాన్ని మనం అద్భుతంగా ఒడిపట్టుకునే వీలుందన్నారు మంత్రి కేటీఆర్. దాని ఆదారంగా రాష్ట్రంలో ఉపాధి కల్పనకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల జనాభా ఉందన్న ఆయన.. కేవలం 2 శాతం మందికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. 

అందుకే ప్రైవేట్ పెట్టబడులను అదికంగా తెచ్చి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా డిజిటల్ రంగంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గానూ 3ఐ విధానాన్ని తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 3ఐ(ఇన్నోవేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్ క్లూజీవ్ గ్రోత్) విజన్ ను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

తెలంగాణ ఏర్పాటు తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి భారీ స్తాయిలో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దిగ్గజ కంపెనీలు సైతం తమ కేంద్రాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. 

ఇప్పటికే టాప్ ఫైవ్ కంపెనీ తమ రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ లో నెలకొల్పాయని గుర్తు చేశారు. దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ముఖ్య కారణమని తెలిపారు. 

95 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా జోనల్ వ్యవస్థ: అసెంబ్లీలో కేటీఆర్

మౌళిక వసతులను మునుపెన్నడూ లేని విధంగా పెంచామని మంత్రి కేటీఆర్ వివరించారు. నిరంతంర విద్యుత్ సహా, పెట్టుబడులకు పెట్టే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందివ్వడం వంటి తదితర కారణాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. 

టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 17,302 పరిశ్రమలకు అనుమతిచ్చామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దవైన 300 కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫార్మా తదితర 14 ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేసుకుని వాటి తయారీ రంగాన్ని సాకారం చేస్తున్నామని చెప్పారు. 

ముచ్చర్లలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మా రంగం ఏర్పడుతోందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాడే హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడా తెలంగాణాలోనే తయారవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఐటీతో కలుపుకుంటే 19 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ఇక ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే ఇచ్చే కొత్త పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios