Asianet News TeluguAsianet News Telugu

YS Sharmila: దొరగారు.. వరంగల్ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు ? : వైయస్ షర్మిల

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకోవడంపై తెలంగాణ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? అని నిల‌దీశారు. 
 

ys sharmila fire on Telangana Cm Kcr Warangal Tour Cancelled
Author
Hyderabad, First Published Jan 18, 2022, 3:18 PM IST

YS Sharmila:  నేడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరంగల్ పర్యటన ఉంది. అయితే.. అనూహ్యంగా సీఎం కేసీఆర్ తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. ఈ ప‌ర్య‌ట‌న ర‌ద్దుపై తెలంగాణ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించింది. సీఎం కేసీఆర్‌ వరంగల్‌ టూర్‌ రద్దు చేసుకోవ‌డంపై  వైఎస్‌ షర్మిల సెటైరిక‌ల్ గా పంచులు వేసింది. కరోనాకు భయపడి.. టూర్‌ వెళ్లడం లేదా అంటూ చురకలు అంటించారు.

వరంగల్ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు దొరా? అని ప్రశ్నించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? అని ప్రశ్నించారు.

'పంట వానపాలు, రైతు కష్టం కన్నీటిపాలు, సాయం దొర మాటలకే చాలని  విమర్శించారు. పంట నష్టపోయి, పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే, నష్టపోయిన రైతును ఆదుకోడానికి, రైతును ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా? అని నిల‌దీసింది. కష్టకాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని ఈ సీఎం మనకొద్దని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల..
  
ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటకు న‌ష్టం వాటిల్లింది. ప్ర‌ధానంగా ఈ  వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. వేలాది హెక్టార్ల పంట నీట పాలైంది. దీనిపై సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు.

అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, అన్నదాతలను ఓదార్చాలని స్థానిక నేత‌ల‌కు పిలుపు నిచ్చారు. కానీ.. కొన్ని అనివార్య కారణాలతో కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది. ఈరోజు నిర్వహించాలనుకున్న వరంగల్ పర్యటనను కేసీఆర్ రద్దు చేసుకున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన స్థానంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios