Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్యలు చేసుకోవద్దు.. జాబ్ నోటిఫికేషన్స్ పైనే తొలి సంతకం.. వైఎస్ షర్మిల..!

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్ అయ్యారు. బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువుకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేటి తెలంగాణను, రేపటి భవిష్యత్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు.. దొరగారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila Fire on CM KCR Over Youth suicides
Author
Hyderabad, First Published Nov 19, 2021, 1:33 PM IST

సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆమె.. తనదైన శైలిలో మండిపడ్డారు.

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్ అయ్యారు. బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువుకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేటి తెలంగాణను, రేపటి భవిష్యత్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు.. దొరగారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కమీషన్ల కోసం కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు.. లిక్కరు ఏరులై పారొచ్చు.. కానీ రైతు పండించిన పంటను మాత్రం కొనలేరా?’ అని షర్మిల నిలదీశారు. ‘బడి పిల్లలకు బువ్వ పెట్టరాదా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వకూడదా? ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చేతకాదా?..’ అని ప్రశ్నలు గుప్పించారు. ‘పాలన చేతకాక ధర్నాలు మాత్రమే చేస్తున్నారు.. సీఎం సారు..’ అని ఎద్దేవా చేశారు.

కాగా.. కేసీఆర్ కు మూడు వారాల గ‌డువిస్తున్నామని.. ఆలోపు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు.  లేదంటే ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకైనా సిద్ధమౌతున్నామన్నారు.
ఈ మేరకు  సీఎం కేసీఆర్‌కు వైయ‌స్ ష‌ర్మిల అల్టిమేటం చేశారు. ఈ మేరకు ఓ వీడియోని కూడా ఆమె షేర్ చేశారు.

 

కాగా..  తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలి సంతకం జాబ్ నోటిఫికేషన్స్ పైనే చేస్తానని చెప్పారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ఏజ్ లిమిట్ పెంచడానికి కూడా కృషి చేస్తామన్నారు. ఈ మేరకు కూడా ఆమె ట్వీట్ చేశారు.

అలాగే రైతుల సమస్యలపై సీఎంను షర్మిల నిలదీశారు.. పంట నష్టపోతే ఆదుకోరని.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొస్తే కొనట్లేదని మండిపడ్డారు. ‘మీరు కొంటారో.. కొనరో తెలియక, కొనుగోలు కేంద్రాల్లో కళ్ల ముందే పంట వానకు తడిసి కొట్టుకుపోతుంటే తట్టుకోని రైతు గుండెలు ఆగిపోతున్నా మీకు కనపడదు.. మద్దతు ధర రాక.. పోయిన ప్రాణాలు మీకు తెలియవ్..’ అంటూ ఫైర్ అయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios