Asianet News TeluguAsianet News Telugu

కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం .. కేసీఆర్ పాలన అంతా గారడీయే: షర్మిల

ఈ నాటికి తెలంగాణ రాష్ట్రంలో పేదరికం పోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మందికి వైఎస్ ఉద్యోగాలు కల్పించారని ఆమె గుర్తుచేశారు. సంక్షేమానికి రారాజు వైఎస్ఆర్ అని ప్రశంసించారు. వైఎస్ఆర్ పథకాలను మళ్లీ అమలు చేయడమే తమ లక్ష్యమని షర్మిల అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని వైఎస్ఆర్ ఉచితంగా అందించారని ఆమె తెలిపారు. 

ys sharmila comments on telangana cm kcr ksp
Author
hyderabad, First Published Jul 8, 2021, 6:47 PM IST

సీఎం కేసీఆర్ గారడీ మాటలతో పాలన సాగిస్తున్నారని షర్మిల ఆరోపించారు. అధికారం ఉండగానే కేసీఆర్ ఫాంహౌస్‌ను చక్కబెట్టుకున్నారని షర్మిల విమర్శించారు. విత్తనాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఎరువులు, ఉద్యోగాల కోసం జనం నిలబడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని ఆమె ఆరోపించారు. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలయ్యాయని షర్మిల తెలిపారు. స్వయం సమృద్ధి ద్వారా తెలంగాణ గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వుంటే పేదలకు భరోసా కలిగేదని అభిప్రాయపడ్డారు.

మార్కెట్‌లో చదువుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నప్పటికీ స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. వ్యాపారం చేసుకుందామంటే కార్పోరేషన్లు లేవని.. లోన్లు లేవని, కేసీఆర్‌కు మనసే లేదని షర్మిల ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వని కేసీఆర్ మోసగాడని ఆమె మండిపడ్డారు. లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని షర్మిల అన్నారు. ఉపాది లేకుండా స్వయం సమృద్ది ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. వీరు నిజంగానే రైతు బంధువులైతే ఆరేళ్లలో 6,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల నిలదీశారు. పల్లెల నుంచి ఎందుకు వలస పోతారని ప్రశ్నించారు.

Also Read:వైఎస్సార్ తెలంగాణ పార్టీ విధి విధానాలు.. ఆ మూడింటికే తొలి ప్రాధాన్యం: వైఎస్ షర్మిల

అప్పులు స్వయం సమృద్ధికి అడ్డుగోడలన్న ఆమె.. పెట్టుబడి కావాలంటే అప్పు, ఫీజు కట్టాలంటే అప్పు, బిడ్డ పెళ్లి చేయాలంటే అప్పు, ఇంటికి అల్లుడు వస్తున్నాడంటే అప్పు, కిరాయి కట్టాలంటే అప్పు, పండగొస్తే అప్పు , వ్యాపారం కోసం అప్పు... అప్పు లేని కుటుంబం తెలంగాణలోనే లేదన్నారు. కేసీఆర్ ఈ ఆరేళ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని షర్మిల ఎద్దేవా చేశారు. మరి పేదరికం ఎందుకు పోలేదన్న ఆమె.. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయని ఆరోపించారు. రైతుల కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం పెడుతున్నారని షర్మిల సెటైర్లు వేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios