ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా...  ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలోనూ ఈ సంబరాలు కొనసాగడం గమనార్హం. కేకులు కోసి, బాణాసంచా కాల్చి ఆనందం పంచుకున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దివంగత మహానేత వైఎ‍స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్ నాయకులు, నరేష్, రమేష్, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఖమ్మంలోనూ ఇదేవిధంగా సంబరాలు జరిగాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కాకుండా చెన్నైలో కూడా సంబరాలు జరుపుకోవడం విశేషం. జగన్ అభిమానులు చెన్నైలో అన్నదానం చేశారు. వెయ్యి మందికి పైగా బిర్యానీ పంపిణీ చేశారు.