హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీటులో తన పేరు చేర్చడాన్ని అ్పపటి గనుల శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. అదనపు చార్జిషీటులో తన పేరు చేర్చడాన్ని ఆమె సవాల్ చేశారు. 

అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి సన్నిహితుడైన పుత్తా ప్రతాప్ రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్ కు అనంతపురం జిల్లా యాడిక మండలంలో 231.9 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 304.74 హెక్టార్ల భూమిని లీజుకు ఇచ్చారు. 

దాని ఫలితంగా పెన్నా గ్రూప్ సంస్థలు జగన్ సంస్థల్లో రూ.68 కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఆరోపీస్తూ సీబీఐ అదనపు చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ ను 2016లో సీబీఐ దాఖలు చేసింది. ఈ అదనపు చార్జిషీట్ లో సీబీఐ శ్రీలక్ష్మి పేరును చేర్చింది. 

సీబిఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్ లో తన పేరును తొలగించాలని కోరుతూ శ్రీలక్ష్మి తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.