దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు.  తెలివిగా జేబులో నుంచి పర్స్ కాజేయాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. దొంగ చేస్తున్న పనిని సదరు వ్యక్తి పసిగట్టాడు. వెంటనే అతనిని అడ్డుకునేందుకు కాలితో తన్నాడు. కాగా.. తనను కాలితో తన్నాడని దొంగ కోపం పెంచుకున్నాడు. అతని గొంతు కోసి  పగ తీర్చుకున్నాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని నీరూస్ కూడలిలో దసపల్లా హోటల్ మలుపులో ఉన్న పాదచారుల బాటపై ఓ యాచకుడు హన్మంతు మద్యం తాగి నిద్రపోతున్నాడు. చాంద్రాయణ గుట్టకు  చెందిన హసన్(19) అటుగా వచ్చి హన్మంతును జేబులో  డబ్బులు దొంగలించాలని ప్రయత్నించాడు.

అయితే.. దానిని గమనించిన హన్మంతు.. వెంటనే హసన్ ని కాలితో తన్నాడు. కాగా.. అక్కడి నుంచి వెళ్లిపోయిన హసన్.. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి బ్లేడుతో హన్మంతు గొంతు కోశాడు. బాదితుడు వెంటనే గట్టిగా కేకలు పెట్టడంతో.. హసన్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.