ఇంటి వద్ద ఆడుకుంటున్న మైనర్ బాలుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి  ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన కాంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కాంచన్ బాగ్ డివిజన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. కాగా.. అదే  ప్రాంతానికి చెందిన యువకుడు అఫ్రోజ్(20) క్లెట్‌ ఇస్తానంటూ.. బాలుడిని సోమవారం రాత్రి శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. 

అక్కడ బాలుడు ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు.. అతని ద్వారా కుటుంబసభ్యుల వివరాలు కనుక్కొని వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు.