తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడిని ఆమె తండ్రి దారుణంగా హతమార్చాడు. షాద్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. అనంతరం యువకుడి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టాడు యువతి తండ్రి రంజిత్.
హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడిని ఆమె తండ్రి దారుణంగా హతమార్చాడు. తన కూతురి నుదిటి మీద తిలకం దిద్ది వేధిస్తున్నాడనే ఆరోపణలతో అతనిని హత్య చేశాడు. అనంతరం యువకుడి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టాడు యువతి తండ్రి రంజిత్. ఈ కేసుకు సంబంధించి రంజిత్‌కు సహకరించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది .
