నల్లగొండ జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. ఓ యువకుడిని దుండగులు వెంటపడి కత్తులతో నరికి చంపారు. దీనికి అతని పెద్దమ్మ కుమారుడే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దనాన్న కుమారుడే మరో ఐదుగురితో కలిసి వెంటపడి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు .

నిందితులు శ్రీకాంత్ అనే యువకుడి టూవీలర్ ను తమ వాహనంతో ఢీకొట్టాడు. అతను కిందపడిన తర్వాత వెంట పడి మరీ హత్య చేశారు. మిర్యాలగుడా మండలం తుంగపాడు గ్రామానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (22) నిడమనూరు మండలం రేగులగడ్డలో గురువారంనాడు తన అమ్మమ్మ దశదిన కర్మకు హాజరయ్యాడు.

ఆ తంతు ముగిసిన తర్ాత అత్త వీరమ్మ, మామ వెంకటయ్యలతో కలిసి టూవీలర్ మీద ఇంటికి బయలుదేరాడు. దారిలో కొంత మంది సుమో వాహనంలో వచ్చి శ్రీకాంత్ టూవీలర్ ను వెనక నుంచి ఢీకొట్టారు దాంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. అత్తమామలు పక్కకు పరుగెత్తారు శ్రీకాంత్ వరి పొలాల్లోకి పారిపోయే ప్రయత్నం చేశారు. 

దుండగులు వెంటపడి శ్రీకాంత్ ను చుట్టుముట్టి వేట కొడవలితో నరికి చంపారు. అతను అక్కడికక్కడే మరణించాడు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు 

శ్రీకాంత్ పెద్దమ్మ కుమారుడు ఒంగూరి మహేందర్ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మృతుని అక్క వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు తమ వెంట తెచ్చుకున్న కారాన్ని ఘటనా స్థలంలో చల్లి పారిపోయారు.