Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేటలో పరువు హత్య?.. వేరే కులం వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నాడని అన్న దారుణం...

సూర్యాపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చెల్లిని ప్రేమించాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు ఆమె అన్న. 

youth honor killing in suryapet over love affair
Author
Hyderabad, First Published Aug 8, 2022, 1:23 PM IST

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువు పై కట్ట మైసమ్మ గుడి దగ్గర ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని  చందన బోయిన దిలీప్ (19)గా  గుర్తించారు. ఈ ఘటనను పరువు హత్యగా అనుమానిస్తున్నారు. ఆళ్లగడ్డకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ ప్రేమ వ్యవహారం యువతి సోదరుడికి నచ్చలేదు. దీంతో దిలీప్ మీద పగ పెంచుకున్నాడు. 

ఈ క్రమంలోనే మాట్లాడుకుందాం రమ్మని సద్దల చెరువు వద్దకు దిలీప్ ను పిలిచాడు. చెరువు దగ్గరకు వెళ్లిన దిలీప్ పై యువతి సోదరుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. బీరు సీసాలతో  పదే పదే పొడిచాడు. దీంతో దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. అరగంట ఆలస్యంగా వచ్చాడని..

ఇదిలా ఉండగా, ఇలాంటి పరువు హత్యాయత్నం ఘటనే మీరట్ లో వెలుగులోకి వచ్చింది. జిమ్ ట్రైనర్ తో తన కూతురు రిలేషన్ పెట్టుకోవడం నచ్చని తండ్రి ఆమెను విషపు ఇంజక్షన్ తో చంపడానికి తెగించాడు. దీనికోసం కాలు విరిగి హాస్పిటల్ లో ఉన్న కూతురికి విషం ఇంజక్షన్ ఇవ్వాలని ఆ హాస్పిటల్ కాంపౌండర్ తో పది లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా లక్ష రూపాయలు కూడా ఇచ్చారు. ఇంజక్షన్ ఇవ్వడానికి వెడుతున్న కాంపౌండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వార్డ్ బాయ్ లు అతడిని పట్టుకున్నారు. 

దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెడితే... జూలై 27న,  ఓ 17 ఏళ్ల బాలిక టెర్రస్ మీద ఉండగా.. కోతుల గుంపు వచ్చింది. వాటినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, పైకప్పు నుండి జారిపడింది. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను మీరట్‌లోని కంకేర్‌ఖేడా ప్రాంతంలోని ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల తర్వాత ఆమెను పల్లవ్‌పురంలోని వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడే శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

పల్లవ్‌పురం ఎస్‌హెచ్‌ఓ అవనీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. "విచారణలో కాంపౌండర్ నేరం అంగీకరించాడు. అతని నుండి సగం ఖాళీ సీసాను స్వాధీనం చేసుకున్నాం. అతని వద్ద నుండి రూ. 90,000 కూడా స్వాధీనం చేసుకున్నాం. అతనికి అతనితోపాటు పనిచేసే ఓ వ్యక్తి, మరో స్టాఫ్ నర్సు సహాయం చేశారు. దీనికి సహాయ పడితే ఆమెకు కూడా రూ. 1 లక్ష ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేరానికి గానూ.. ఆ అమ్మాయి తండ్రిని, కాంపౌండర్ ను, నర్సును, మరొక వ్యక్తిని అరెస్టు చేసాం. వారిపై IPC సెక్షన్లు 307, 328 కింద కేసు నమోదు చేయబడిందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios