Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో దారుణం.. వడ్డీ వ్యాపారి వేధింపులతో యువకుడి ఆత్మహత్య...

కరీంనగర్ లో వడ్డీ వ్యాపారి వేధింపులకు ఓ యువకుడి ప్రాణాలు బలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

Youth ends life unable to tolerate harassment by money-lender in Karimangar
Author
Hyderabad, First Published May 28, 2022, 7:18 AM IST

కరీంనగర్ : money-lenderల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంతోమంది వీరి వేధింపులకు బలవుతున్నారు. తాజాగా మానకొండూర్ harassmentల కారణంగా ఓ యువకుడు suicideకు పాల్పడ్డాడు. ఈ ఘటన Karimangar జిల్లా అన్నారంలో చోటుచేసుకుంది.  పోలీసుల కథనం మేరకు..  మార్క ప్రశాంత్ గౌడ్ (26)కు రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన అనన్యతో ఆరు నెలల కిందట వివాహం జరిగింది.  ప్రస్తుతం ఆమె గర్భిణీ..  కరీంనగర్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ప్రశాంత్ పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి రామాంజనేయులు వద్ద కొంత అప్పు తీసుకున్నాడు. మొత్తం రూ. 20 లక్షలు అయింది. ఈ విషయం చెప్పగా కొంత చెల్లించాడు, మిగతాది ఇవ్వాలని వడ్డీ వ్యాపారి తీవ్రంగా వేధిస్తున్నాడు. కాస్త సమయం తీసుకుని ఇస్తానని.. చెప్పినా అతని వేధింపులు ఆగలేదు.

దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ప్రశాంత్ గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స తీసుకుంటూ శుక్రవారం మరణించాడు.  మృతుని వద్ద నాన్న, అమ్మ, సోదరుని పేరిట ఓ లేఖ లభించింది.. వివాహం చేసుకుని అనన్యకు అన్యాయం చేశానని,  సారీ అనన్య అంటూ లేఖలో ఉంది. కాగా జమ్మికుంట-మానకొండూరు రహదారిపై బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. బాధితులకు న్యాయం చేస్తానని సిబిఐ క్రిష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు ఆగస్ట్ లో నిజామాబాద్ లో జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని నాగరాజు (30) అనే వ్యక్తిని వేధించసాగాడు శ్రీనివాస్ అనే ఓ వడ్డీ వ్యాపారి. కరోనా వల్ల ఆదాయం లేకుండాపోయిందని, తర్వాత ఇస్తానని నాగరాజు చెబుతూ వస్తున్నాడు. అయితే, డబ్బు వెంటనే చెల్లించాలని, నాగరాజు కొత్త బైకును లాక్కు వెళ్లాడు వడ్డీ వ్యాపారి.

అంతేగాక, ఓ రోజు నాగరాజును వడ్డీ వ్యాపారి తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి పట్టుకుని చావబాది వదిలేశాడు. మరో రోజు నాగరాజు ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలని వడ్డీ వ్యాపారి గొడవపెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి తన భర్తను వేదింపులకు గురిచేస్తోన్న తీరును చూసి నాగరాజు భార్య అఖిల భరించలేకపోయింది. 

తన మెడలోకి బంగారు పుస్తెలతాడు తీసి వడ్డీ వ్యాపారికి ఇచ్చింది అఖిల. తన భార్య పుస్తెల తాడు ఇవ్వడంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఫ్యానుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

మృతుడు నవాతే నాగరాజు స్థానిక గంజ్ లో గుమాస్తాగా పనిచేసేవాడు. వ్యాపార నిమిత్తం జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం కోనాసముందర్ గ్రామానికి చెందిన బాదం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రెండేళ్ల క్రితం రూ. లక్షా 20 వేలు అప్పుగా తీసుకుని తిరిగి డబ్బు చెల్లించలేకపోయాడు. అందుకే నాగరాజును శ్రీనివాస్ వేదించసాగాడని అఖిల బంధువులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios