పీకలదాకా మద్యం సేవించి నలుగురు యువకులు బీభత్సం సృష్టించారు. ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అంబులెన్స్ ని ఢీ కొట్టారు. ఈ సంఘటన హస్తినపురం అమ్మ హాస్పిటల్ రోడ్డులో శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

Also Read ఉద్యోగం ఆశచూపి అత్యాచారం...దోషికి జీవిత ఖైదు...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి  చెందిన నలుగురు యువకులు జగదీశ్, అజయ్, రాకేష్,శ్రీకాంత్ డిగ్రీ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం మన్నెగూడలో ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్ని తిరిగి కారులో వస్తున్నారు. వారు సరూర్‌ నగర్  వెళ్లే క్రమంలో హస్తినపురం వద్ద అమ్మ ఆస్పత్రి రోడ్డులో అతి వేగంగా వస్తూ రోడ్డు పక్కన నిలిచిఉన్న అంబులెన్స్‌ వాహనాన్ని ఢీకొట్టారు.  కాగా...యువకులు మద్యం మత్తులో ఉన్నారు.

కారులో మద్యం బాటిళ్లు, చికెన్‌ లభించింది. అయితే, వారు సీట్‌ బెల్టు ధరించడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యువకులు బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులకు పరీక్షలు చేయగా.. కారు నడుపుతున్న వ్యక్తి జగదీశ్‌కు ఆల్కహాల్‌ రీడింగ్‌ 120 వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్‌ డీసీపీ యాదగిరి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.