ఉద్యోగం ఇస్తానని ఆశ చూపించి ఓ యువతిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. అతనికి న్యాయస్థానం శిక్ష విధించింది. జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read చేవెళ్ల వంతెన కింద నగ్నంగా మహిళ శవం: కేసులో పురోగతి, దొరికిన క్లూ...

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దవులూరుకు చెందిన రవిశేఖర్ (48) ఓ సాదారణ రైతు. పలుపేర్లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేసి అంతర్రాష్ట్ర నేరస్థుడిగా మారాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక లో అతనిపై దాదాపు 40 కేసులు ఉన్నాయి. మూడు కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయి.

కాగా.. 2019 జులై23న ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి(21)ని కారులో అపహరించుకకుపోయాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడు కారులో కడప, కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లో యువతిని తిప్పుతూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా.. చివరకు అతని చెర నుంచి బయటపడిన యువతి హైదరాబాద్ చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆగస్టులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు నేరం అంగీకరించాడు.  కాగా... అతనిని కోర్టులో హాజరుపరచగా.. జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా రూ.90వేల జరిమానా కూడా విధించారు. దానిలో రూ.50వేలు బాధితురాలికి ఇవ్వాలని కోర్టు పేర్కొంది.