కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి సమీపంలో గల ఉగ్రవాయి గ్రామ సమీపంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రదీప్ గౌడ్ అనే యువకుడు బైక్ పై వేగంగా వెళ్తూ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానికి గురై మరణించాడు. లవ్ ఫెయిల్యూర్ అంటూ అతను సెల్ఫీ వీడియో తీసుకుంటూ పడిపోయి ప్రాణాలు వదిలాడు.

బైక్ నడిపిస్తూనే లవ్ ఫెయిల్యూర్ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టాడు. ఆ తర్వాత అతను బైక్ పై వెళ్తూ ఆటోను ఢీకొన్నిాడు. దాంతో మృత్యువాత పడ్డాడు. రాజంపేటకు చెందిన ఓ యువకుడు ఆదివారం ఈ ప్రమాదంలో మరణించాడు. 

రాజంపేటకు చెందిన ఎల్కంటి వెంకటేష్ గౌడ్ కు ఓ కుమారుడు, కూతురు ఉన్నిారు. వీరిలో పెద్దవాడు ప్రదీప్ గౌడ్ (19) చదువు మానేసి కల్లు డిపోలో, వైన్స్ లో పనిచేశాడు. కొంత కాలంగా ఖాళీగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోంచి బయలుదేరిన ప్రదీప్ సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఉగ్రవాయి స్టేజీకి కొద్ది దూరంలో గల సాయిబాబా గుడి వద్ద ఆటోను ఢీకొట్టి మరణించాడు. 

రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రదీప్ గౌడ్ ప్రమాదానికి ముందు ఒక గంట ముందు నుంచే ఆన్ లైన్ లో ఉన్నాడు. బైక్ నడిపిస్తూ తన సెల్ ఫోన్ తో లవ్ ఫెయిల్యూర్ అంటూ మాట్లాడుతూ వాట్సప్ స్టేటస్ పెట్టాడు. సరిగ్గా గంట తర్వాత అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

అతను ఎక్కడికి వెళ్లాడు, ఏ జరిగిందనే విషయాలపై స్పష్టత లేదు. లవ్ ఫెయిల్యూర్ అంటూ అతను ఏడుస్తూ స్టేటస్ పెట్టడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.