తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతోంది. ఈ వర్షాలకు వరదలు పొంగి పోర్లాయి. అయితే.. ఈ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతలమైపోయింది. చెట్లు నెలకొరిగిపోయాయి. ఈ రోజు కాస్త వర్షం తగ్గడంతో కాస్త ఊరటనిచ్చింది. కాగా.. ఈ వర్షంలో ఇద్దరు యువకులు పానీపూరీ తినడానికి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లు మంగళవారం సాయంత్రం తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్ కు పానీపూరి తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో వరదలో కొట్టుకుపోయారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వేలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

మరోవైపు నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలతో ఏర్పడిన వరదలో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు. విధులు ముగించుకుని బండ్లగూడా మల్లికార్జున నగర్‌లోని ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా నీళ్లలో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తు 48 గంటలు తర్వాత సందర్‌ శవమై తేలడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.