విదేశంలో స్థిరపడదామని వెళ్లిన ఆ యువకుడి ఆశలు గల్లంతయ్యాయి.  సరైన ఉద్యోగం రాలేదు. దీంతో... తల్లిదండ్రుల సహాయంతో... స్వదేశానికి వచ్చాడు. కానీ... కెరీర్ లో సక్సెస్ కాలేకపోయాననే బాధ మాత్రం అలానే ఉండిపోయింది. దీంతో... మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాయకల్ మండలంలోని ఒడ్డె లింగాపూర్ లో బోదాసు రాజు(20) అనే యువకుడు ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అయితే.... అక్కడ అతను స్థిరపడలేకపోయాడు. దీంతో... తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అక్కడి నుంచి స్వదేశానికి రావడానికి కూడా తల్లిదండ్రులే డబ్బులు పంపించారు.

ఆ డబ్బులతో స్వదేశానికి వచ్చాడు. అయితే.. సక్సెస్ కాలేకపోయానని బాధపడిపోయాడు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని మామిడి తోట వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా... కళ్ల ముందు ఎదిగిన బిడ్డ అలా చనిపోవడంతో... వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.