ప్రాణం కన్నా ఎక్కువగా ఆమెను ప్రేమించాడు. కానీ... ఆమె అతనిని కాదని మరో వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది. ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే బాధతో సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Also Read మరో దిశ: యువతి ముఖంపై బండరాయితో మోది... గుర్తు పట్టనంతగా..

పూర్తి వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సదానందం(23) నాచారంలో ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. కాగా... అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు మరో యువకుడితో ఇటీవల వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది.  ఈ నెల 16వ తేదీన ఆమె వివాహం జరిగిపోయింది కూడా. అయితే... తాను ప్రేమించిన యువతి తనకు దక్కలేదనే బాధతో ఈ నెల 15వ తేదీన రాత్రి సదానందం విపరీతంగా మద్యం సేవించాడు.

తాను ప్రేమలో ఓడిపోయానంటూ స్నేహితులందరికీ చెప్పాడు. కాగా... ఆ స్నేహితులు కూడా అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కాగా.... సరిగ్గా యువతి పెళ్లి ముహుర్తానికి మౌలాలి-చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మరోవైపు సదానందం కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదానందం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.