ప్రేమలో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోని ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే...  మారేడుపల్లి సెకండ్ లక్ష్మీ నగర్ బస్తీలో నివాసమంటున్న రవి చైతన్య(21) బేగంటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  రవి... గత కొంతకాలంగా మారేడుపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

అయితే... ఇటీవల ఆ యువతికి అతనికి దూరమైంది. ప్రేమ విఫలం కావడంతో మనస్థాపానికి గురైన రవిచైతన్య సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బయటి నుంచి వచ్చి తలుపులు తెరిచిచూడగా రవి కొన ఊపిరితో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 

చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రేమ విఫలం కావడంతో రవిచైతన్య ఉరేసుకుని మృతి చెంది ఉండవచ్చునని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.