నేరుగా గ్రామ సమీపంలోని కంపచెట్లలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అయితే కంపచెట్ల నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలోని గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే వెళ్లి చూడగా యువకుడి చేతిలో ఏడుస్తున్న చిన్నారిని గమనించారు.

పెద్దమందడి : wanaparthy జిల్లాలోని పెద్దమందడి మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన యువకుడు molestationకి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై pocso case నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం చిన్నారి దుకాణానికి వెళ్లి Chocolates తెస్తుండగా అటుగా వస్తున్న యువకుడు పాపను ఎత్తుకెళ్లాడు. 

నేరుగా గ్రామ సమీపంలోని కంపచెట్లలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అయితే కంపచెట్ల నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలోని గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే వెళ్లి చూడగా యువకుడి చేతిలో ఏడుస్తున్న చిన్నారిని గమనించారు.

అక్కడి దృశ్యం చూడగానే వారికి విషయం అర్థం అయ్యింది. వెంటనే యువకుడికి అక్కడే దేహశుద్ధి చేశారు. ఈ మేరకు బుధవారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో కొందరు యువకులు గంజాయి తాగేందుకు అలవాటు పడ్డారని, దీంతో నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిమీద పోలీసులు దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎస్సై దృష్టికి తీసుకువచ్చారు. 

ఇదిలా ఉండగా, రెండున్నర ఏళ్ల బాలికపై molestation చేసి murder చేసిన 37 ఏళ్ల వలస కార్మికుడికి గుజరాత్లోని సూరత్లో POCSO Court డిసెంబర్ 8న మరణశిక్ష విధించింది. సూరత్ లోని పందేసర ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్ కి చెందిన గుడ్డు యాదవ్ అనే కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

రాజేంద్రనగర్ : పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య కేసు .. సైకో భర్త అరెస్ట్

నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలిక పై హత్యాచారానికి పాల్పడిన యాదవ్ ను అదే నెల 8న పోలీసులు arrest చేశారు. ఈ కేసులో ఏడు రోజుల్లోనే 246 పేజీల ఛార్జీషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

ఈ కేసులో 43 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం… కేవలం 28 రోజుల్లోనే తీర్పును వెలువరించింది. సోమవారం నిందితుడు గుడ్డు యాదవ్ ను దోషిగా తేల్చిన కోర్టు మంగళవారం మరణశిక్ష ఖరారు చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల Compensation ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇలాంటి మరో చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు డిసెంబర్ 7న తీర్పు వెలువరించింది. hyderabad లంగర్ హౌస్ లో ఓ ఏడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిపై అత్యంత కర్కషంగా అఘాయిత్యానికి పాల్పడిన పెద్ద పకీరప్ప(38) ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

అతడిపై POCSO ACTతో పాటు అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ అత్యాచారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఇంతకాలం విచారణ జరిగింది. తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. పకీరప్ప చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువవడంతో Life Imprisonment విధించిన నాంపల్లి కోర్టు. అలాగే నిందితుడికి రూ.28వేల జరిమానా విధించింది.