నిద్రపోతున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగఘటన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మౌలాలి చందాబాద్‌కు చెందిన అర్పుల కార్తీక్‌(21) ఆదివారం రాత్రి ఓ మహిళ(55)తన ఇంట్లో నిద్రపోతుండగా లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. 

ఆమె మేల్కొని కేకలు వేసింది. బాధితురాలి భర్త నిద్రలేచి యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. బాధితురాలు మల్కాజిగిరి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.