తెలంగాణ సీఎం కేసీఆర్ ని ధూషించినందుకు పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు టిక్ టాక్  యాప్ లో కేసీఆర్ ని దారుణంగా తిడుతూ వీడియో చిత్రీకరించాడు. తర్వాత దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆ వీడియో వైరల్ కావడంతో... విషయం పోలీసులకు తెలిసింది. దీంతో.. యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ టిక్ టాప్ యాప్ కారణంగా యువత చెడిపోతుందనే కారణంతో ఇప్పటికే ఈ యాప్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి దీనిని తొలగించారు. అయితే.. కొత్తగా ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోలేరు..కానీ.. ఆల్రెడీ ఉన్నవాళ్లు మాత్రం వినియోగించుకునే అవకాశం ఉంది.