చదువుకుంటానంటే తల్లిదండ్రులు పెళ్లిచేస్తామనడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ధర్మపురిలోని జైనా గ్రామంలో వినీత అనే యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. 

అయితే వినీత మాత్రం తాను చదువుకుంటానని ఇప్పుడే పెళ్లి వద్దని చెబుతోంది. అది వినకుండా తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. 

ఎస్సై కిరణ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. జైనాకు చెందిన సట్టా వినీత(20)కి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. యువతి మాత్రం తనకు పెళ్లి వద్దని, చదువుకోవాలని ఉందని ఎంత చెప్పినా వారు వినలేదు. దీంతో మనస్తాపం చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.