తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర.. ప్రభుత్వోద్యోగం కోసం నిరీక్షణ, చివరికి

ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిర్సెడు గ్రామానికి చెందిన షరీఫ్ అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 

young man commits suicide by falling under train in karimnagar district ksp

ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ, ఐటిఐ చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్నా కొలువు రావడం లేదనే మనస్థాపంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిర్సెడు గ్రామానికి చెందిన షరీఫ్ అనే యువకుడు తొమ్మిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న షరీఫ్ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్న షరీఫ్ కొన్ని రోజులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో షరీఫ్ ఆదివారం ఉదయం రైలు కింద పడి చనిపోయాడని మృతుడి బంధువులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి బంధువులకు షరీఫ్ జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు మృతుడి బంధువులు.  కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios